గుజరాత్ రిజల్ట్స్ వచ్చే వరకు సిసోదియాను జైల్లో ఉంచుతారేమో : కేజ్రీవాల్‌

-

మోదీ సర్కార్ గుజరాత్ ఎన్నికల్లో తమను గెలవనీయకుండా కుట్రలు పన్నుతోందని దిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అందుకే మనీష్‌ సిసోదియాను తప్పుడు కేసులో ఇరికించిందని ఆరోపించారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా సిసోదియాను నిలువరించేందుకు గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆయణ్ను జైల్లో ఉంచడానికి ప్లాన్ వేస్తోందని ఆరోపణలు చేశారు.

దిల్లీ లిక్కర్ స్కామ్ లో సిసోదియాకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో భాగంగా సోసిదియా ఇవాళ సీబీఐ ఎదుట హాజరయ్యారు. సీబీఐ కార్యాలయానికి వెళ్లేముందు సోసిదియా బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తనను గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా.. నకిలీ కేసులో అరెస్టు చేసేందుకు బీజేపీ ప్లాన్‌ చేసిందని ఆరోపించారు.
‘‘రానున్న రోజుల్లో నేను గుజరాత్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. నన్ను ఆపడమే వారి ఉద్దేశం. బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. బీజేపీ ప్లాన్‌లో భాగంగా నన్ను నకిలీ కేసులో అరెస్టు చేయనున్నారు. గతంలో నేను గుజరాత్‌ వెళ్లినప్పుడు దిల్లీ తరహా పాఠశాలను నిర్మిస్తానని అక్కడి ప్రజలకు మాట ఇచ్చాను. అది కొందరికి నచ్చడం లేదు. నన్ను జైలుకు పంపడంతో ఎన్నికలు ఆగవు. రానున్న రోజుల్లో ఆ ఎన్నికలు ఉద్యమంలా మారనున్నాయి’’ అంటూ సిసోదియా బీజేపీపై విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version