మరోసారి పాక్పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్

-

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, పాకిస్తాన్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, పాక్ ప్రభుత్వం, దాని నిఘా సంస్థ ISIల అసలు ముసలాలని మండిపడ్డారు. పాకిస్తాన్‌ను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) గ్రే లిస్ట్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అణు బాంబుల బెదిరింపులు చేసిన పాక్ మంత్రిపై కూడా ఒవైసీ ఘాటుగా స్పందించారు. “మీరు కేవలం అరగంట కాదు.. అర్ధ శతాబ్దం వెనుకబడి ఉన్నారు” అంటూ చురకలంటించారు. పాక్ బడ్జెట్ భారత సైనిక బడ్జెట్‌కే సరిపోదని అన్నారు.

భారత్‌లో హిందూ–ముస్లింల మధ్య భిన్నత కలిగించేందుకు పాకిస్తాన్, ISI, లష్కరే తోయిబా కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. అలాగే, “భారతదేశంలో రక్తపాతం జరుగుతుంది” అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) చైర్మన్ బిలావల్ భుట్టో-జర్దారీపై కూడా ఒవైసీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. “ముందు మీ తల్లిని ఉగ్రవాదులు ఎలా హత్య చేశారో తెలుసుకోండి. ఆ తర్వాత పెద్ద మాటలు మాట్లాడండి. చిన్న పిల్లల మాదిరి మాట్లాడకండి” అని ఘాటుగా సూచించారు. పాకిస్తాన్ కుట్రలు చేస్తే.. వారికే పెద్ద నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఒవైసీ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news