తెలంగాణను సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎల్కతుర్తిలో సబ పెట్టి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదు.. రేషన్ కార్డులను నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ నే అని గుర్తు చేశారు. కేసీఆర్ చేసినటువంటి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్.
కృష్ణా నది ఉమ్మడి నీటి కేటాయింపులో 512 ఆంధ్రాకి తీసుకుపోండి.. 299 సరిపోతాయని.. తెలంగాణకు కేసీఆర్ ప్రబుత్వం ద్రోహం చేసిందని తెలిపారు. కేంద్రంతో కొట్లాడి కృష్ణా నది కేటాయింపులు మాకు 500 టీఎంసీలు రావాలని వాదనలు వినిపిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై 1లక్ష81వేల కోట్లు ఖర్చు చేసి జేబులు నింపుకున్నారు. కానీ ఎక్కడ రైతులకు మేలు జరగలేదన్నారు. వాళ్ల కమీషన్ల కక్కుర్తి వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని తెలిపారు. SLBC, డిండి ప్రాజెక్ట్ ల జోలికి పోలేదన్నారు.