భారత ఆటగాళ్ల పై ట్రోల్స్…ఓవైసీ షాకింగ్ కామెంట్స్..!

-

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై హైదరాబాద్ ఎంపీ ఓవైసీ కౌంటర్ వేశారు. అమిత్ షా కాశ్మీర్ పర్యటన లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేకుండా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశం పై ఓవైసీ స్పందించారు. కాశ్మీర్ లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేకుండా మాట్లాడటం తో కొత్తేముందని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. గతం తో తాను పార్లమెంటరీ ప్రతినిధుల బృందం తో ఉన్నప్పుడు కూడా కాశ్మీర్ లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేకుండా పర్యటించామని చెప్పారు.

అంతే కాకుండా ప్రస్తుతం పరిస్థితులు మారాయని ఓవైసి వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై టీమ్ ఇండియా ఓటమి నేపథ్యం లో భారత్ ఆటగాళ్ళ పై సోషల్ మీడియాలో జరుగుతున్న దాడిని ఓవైసీ ఖండించారు. దేశం లో ప్రతి అంశం కూడా మతాల మధ్య గొడవ లా తయారు అవుతుందని అమిత్ షా అన్నారు. మైనారిటీ లను దోషులుగా చూపించి మెజారిటీ మతస్థుల ను ఉపయోగించుకునేలా రాజకీయాలు మారాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version