RRR Movie: ఆర్.ఆర్.ఆర్ ఫైనల్ కట్ రెడీ.. ఆ 30 నిమిషాలు మ‌మూలుగా ఉండ‌దు.

-

RRR Movie: టాలీవుడ్ జ‌క్క‌న్న, ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఆర్‌.ఆర్‌.ఆర్‌. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగ‌ర్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిస్తుండ‌టంతో ఈ సినిమాపై ఎన‌లేని క్రేజ్ వ‌చ్చింది. ఇప్ప‌టివర‌కూ ప‌రాజ‌యం అంటూ తెలియ‌ని ద‌ర్శ‌క దిగ్గ‌జం.. బ‌హుబ‌లితో తెలుగు సినిమా కీర్తిని ప్ర‌పంచ వ్యాప్తం చేసిన రాజ‌మౌళి తీస్తున్న చిత్రం కావ‌డం, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండడంతో అంచనాలు తార‌స్థాయికి చేరాయి. ఈ సినిమాపై ఒక టాలీవుడే కాదు.. యవత్తు సినీ ప్ర‌పంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయ‌డానికి సిద్దంగా ఉంద‌ని టాక్.

ఈ క్ర‌మంలో ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ వెలువ‌డింది. ఇప్ప‌టికే ఈ సినిమా పనులన్నీ పూర్తి అయ్యాయి. కానీ రాజ‌మౌళి మ‌రోసారి ఫైనల్ కట్ కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చివ‌రి 30 నిమిషాల క్లైమాక్స్ ఉంటుందని. ఇది సినిమాకే హైలెట్ అయి.. యాక్ష‌న్ స‌న్నీవేశాల‌ను చాలా ఉత్కంఠ భరితంగా తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తుంది. ఆ ఫైట్స్ లో రాజ‌మౌళి త‌న మార్కును క‌చ్చితంగా చూపిస్తాడని టాక్.

ఇక సినిమా రన్ టైమ్ కూడా ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వెలువడుతున్నాయి. ఈ సినిమా దాదాపు రెండు గంటల 45 నిమిషాల నిడివి ఉంటుంద‌ని సినీ వ‌ర్గాల టాక్. బ‌హుబ‌లి సినిమా కంటే.. ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం మరికొంత టైమింగ్ ను పెంచిన‌ట్టు తెలుస్తుంది.

మ‌రోవైపు.. ఏకంగా మూడు గంటలకు పైనే ఉంటుంద‌ని టాక్. ఎందుకంటే.. సినిమాలో పాటలు కూడా పది వరకు ఉన్నాయ‌నీ, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల యాక్షన్ సన్నివేశాలు భారీ ఎత్తున్న తెరకెక్కిస్తున్నారు కాబట్టి.. సినిమా నిడివి చాలా ఎక్కువ అవుతుందని అంటున్నారు. రాజ‌మౌళి.. గత చిత్రాలు బాహుబలి, బాహుబలి 2 కూడా మిగతా చిత్రాలతో పోల్చితే ఎక్కువ రన్ టైం కలిగి ఉన్నాయి.

ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా వేయిట్ చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే పలుసార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది జ‌క్క‌న్న అండ్ టీం. ఇప్పటికే విడుదలైన ఇద్దరు హీరోల ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ సింగిల్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఇక బాక్సాఫీస్ వద్ద సినిమా భారీ స్థాయిలో ఒపెనింగ్స్ అందుకుంటుందని ఇప్పటికే ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version