ఈ రోజు నుండి ఇంగ్లాండ్ లోని లీడ్స్ వేదికగా మూడవ యాషెస్ టెస్ట్ మొదటి రోజు జరుగుతోంది, వరుసగా రెండు టెస్ట్ లలోనూ ఓడిపోయిన ఇంగ్లాండ్ కు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో టాస్ గెలిచిన బౌలింగ్ తీసుకుంది. అయితే ఇంగ్లాండ్ బౌలర్లు కూడా చకచకా నాలుగు వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత అసలు విషయం స్టార్ట్ అయింది.. యాషెస్ టెస్ట్ లో తొలిసారి ఆడే అవకాశం దక్కించుకుని క్రీజులోకి వచ్చిన ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఆరంభం నుండి బాదుడు కార్యక్రమం స్టార్ట్ చేశారు. హెడ్ తో కలిసి మార్ష్ ఇంగ్లాండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు.. ఈ దశలో మార్ష్ కేవలం బంతుల్లోనే సెంచరీ మార్క్ ను చేరుకున్నాడు. చివరికి ఇంకా వేగంగా ఆడే క్రమంలో క్రిస్ వోక్స్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి క్రాలీ చేతికి చిక్కాడు. దీనితో మార్ష్ ఇన్నింగ్స్ 118 పరుగుల వద్ద ముగిసింది.
యాషెస్ టెస్ట్: 102 బంతుల్లో మిచెల్ మార్ష్ సెంచరీ…
-