నైరుతి ఆవర్తనం ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5 నుంచి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. అది ఎత్తుకు వెళ్లేకొద్ది నైరుతి దిశ వైపునకు వంగి పయనిస్తుందని తెలిపారు. తూర్పు, పశ్చిమ ద్రోణి సముద్ర మట్టం నుంచి 4.5 కి.మీ నుంచి 7.6 కి.మీ ఎత్తు మధ్య స్థిరంగా కొనసాగుతున్నదని పేర్కొంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు.
నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు. రేపు, ఎల్లుండి ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. తాజా హెచ్చరికల క్రమంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.