రామతీర్థం ఘటనలో తనపై కేసు పెట్టినందుకు గాను ఏపీ హై కోర్టు ను ఆశ్రయించారు అశోక్ గజపతిరాజు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. తన పై నమోదైన ఎఫ్ ఐ ఆర్ పై హైకోర్టును ఆశ్రయించానని.. తన పై నమోదు అయిన కేసు లో పోలీసులు 41 ఏ నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న రామతీర్ధంలో ఎన్నడూ లేని ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో జరగటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
దేవస్ధానంకి సమర్పించే కానుకలకు కూడా మంత్రులు అనుమతులు అడుగుతున్నారని.. మంత్రులు నా కుటుంబం, నా సంస్కారం కోసం మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తన కుటుంబం దేశద్రోహి కుటుంబం అంటున్నారని.. నన్ను విమర్శించే వారిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని మండిపడ్డారు. నేను ఆలయాలకు సంభందించి ఏ విషయం అడిగినా అధికారులు చెప్పటం లేదని.. సింహాచలం దేవస్థానంకి వెళ్లే ముందు టోల్ గేట్ కూడా కట్టే వెళ్తున్నానని పేర్కొన్నారు. టోల్ గేట్ కట్టకపోతే కేసు పెడతారనే భయమేస్తోందని.. నన్ను కేసులతో వేధిస్తున్నారని చెప్పారు.