రైతులను అప్పుల పాలు చేస్తున్న రైతు హంతక ప్రభుత్వం మనకొద్దు- వైఎస్ షర్మిళ

-

ప్రజా సమస్యలపై స్పందిస్తున్న వైఎస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిళ మరోసారి ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఫై విమర్శనాస్త్రాలు సంధించింది. ఇటీవల తెలంగాణలోని పలు సమస్యలైన ధాన్యం కొనుగోలు, నిరుద్యోగ సమస్య, వ్యవసాయంపై ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను ఘాటుగా విమర్శిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఆమె విమర్శలు ఎక్కపెడుతున్నారు. మరోసారి ట్విట్టర్ వేదికగా వైెఎస్ షర్మిళ.. సీఎం కేసీఆర్ పై ఫైరయ్యారు.

వైఎస్ షర్మిళ ట్విట్టర్లో…’’రైతులను ఆదుకోవాల్సిన సర్కార్ దీక్షలతో, ధర్నాలతో డ్రామాలు చేస్తుంటే,మాకు ఏ దిక్కూ లేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంట పండక, పెట్టుబడి రాక, అప్పులు తట్టుకోలేక పురుగుల మందు తాగి రోజుకు ఇద్దరు, ముగ్గురు రైతులు చనిపోతున్నా.. కనీసం ఆ కుటుంబాలను ఓదార్చాలనే సోయి కూడా లేదు దొరగారికి. ఢిల్లీలో రైతులు చనిపోతే ఆదుకోవడానికి లక్షలు ఇచ్చే కేసీఆర్ గారికి మన రైతులు చనిపోతే పట్టించుకోవడానికి కనీసం టైం కూడా లేదు. రైతులు చనిపోయేలా చేస్తున్న రైతు హంతక ప్రభుత్వం మీది. రైతును అప్పులపాలు చేస్తున్న ముఖ్యమంత్రి మనకొద్దు. రైతు ఆవేదన తీర్చలేని ముఖ్యమంత్రి మనకొద్దు.‘‘ అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version