కరోనా వైరస్ తగ్గినట్టే కనిపిస్తోన్నా మళ్ళీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ ఇప్పుడేమో పండగ సీజన్, ఎలాగోలా దసరా పండుగ అయిపొయింది. ఇంకా దీపావళి మిగిలే ఉంది. ఈ క్రమంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే టపాసుల మీద ఆయన బ్యాన్ విధించారు.
అలానే కాలం చెల్లిన వాహనాలు అంటే వెతికి అయితే ఫిట్ నెస్ సర్టిఫికేట్ లు లేవో అలాంటి వాటిని కనిపించిన వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు. అయితే ఆయన టపాసుల బ్యాన్ మీద మాత్రం అనేక విమర్శలు వస్తున్నాయి. హిందువుల పండుగల మీద మాత్రమే ఇలాంటి ఆంక్షలు పెడతారని, మిగిలిన పండుగల విషయంలో ఏమీ మాట్లాడరని అంటున్నారు. ఈ మేరకు చాలా మంది నెటిజన్లు ఆయన మీద ఫైర్ అవుతున్నారు. చూడాలి మరి ఈ విషయం ఎంత దూరం వెళుతుందో ?
Rajasthan CM Ashok Gehlot directs officials of the state for a ban on the sale of fire-crackers and action against vehicles without fitness certificate, as a precautionary measure against #COVID19 and safety of people. pic.twitter.com/pnE58Jor0o
— ANI (@ANI) November 2, 2020