ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ క్వారెంటైన్ లోకి వెళ్ళిపోయారు. ఆయన సన్నిహితంగా మెలిగిన ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ కావంతో ఆయన క్వారెంటైన్ లోకి వెళ్ళారు. అయితే ఆయన తనకు ఆరోగ్యం బాగా ఉందని, ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు.
“నేను # COVID19 కు పాజిటివ్ గా నిర్ధారించబడిన ఓ వ్యక్తికి కాంటాక్ట్ గా గుర్తించబడ్డాను. అయితే నేను బాగానే ఉన్నాను, నాకు ఎలాంటి లక్షణాలు లేకుండా ఉన్నాను కానీ @WHO ప్రోటోకాల్‌లకు అనుగుణంగా రాబోయే రోజుల్లో నేను ఇంటి నుండి పని చేస్తాను” అని టెడ్రోస్ ఒక ట్వీట్ చేశారు. జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం అందించిన గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 46 మిలియన్లను దాటింది. ఇక నిన్నటి లెక్కల ప్రకారం ఖచ్చితమైన కేసుల సంఖ్య 46,110,801 గా ఉంది. వైరస్ వలన చనిపోయిన వారి సంఖ్య 1,195,930 కు చేరుకుంది.