NTR30 మూవీలో బుల్లితెర బ్యూటీ.. సైఫ్​కు జోడీగా..!

-

చైత్ర రాయ్ ఈ పేరు వెండితెర ప్రేక్షకులకు తెలియదేమో కానీ.. బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం బాగా తెలుసు. చైత్ర కంటే అష్టాచమ్మా స్వప్న అంటే ఇంకా బాగా గుర్తు పడతారు. ఈ భామ కొన్నేళ్లుగా బుల్లితెరపై ఏకఛత్రాధిపత్యం చూపించింది. పాప పుట్టిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకుంది ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్​ను ఎంజాయ్ చేస్తోంది.

అయితే పాపతో జాలీగా గడుపుతున్న చైత్రకు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ఆఫర్ అంటే అట్టాంటి ఇట్టాంటి ఆఫర్ కాదు. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలో. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్​కు జంటగా నటించే ఛాన్స్. అదిరింది కదా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్​ ఇండియా సినిమా NTR 30లో బాలీవుడ్ స్టార్ యాక్టర్​ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఆయనకు భార్య పాత్ర పోషించే అవకాశం చైత్ర రాయ్​కు దక్కినట్లు తెలిసింది. ఇప్పటికీ చిత్రీకరణలో కూడా పాల్గొన్నారని సమాచారం అందింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version