ఉద్యోగులకు IBM షాక్.. వచ్చే ఐదేళ్లలో 7,800 ఉద్యోగాల స్థానంలో ఏఐ

-

అయిపోయింది.. అంతా అనుకున్నట్టే అవుతోంది. ఏఐ వల్ల ఉద్యోగాలకు ముప్పు అని ఇన్నాళ్లు భయపడినదంతా నిజమవుతోంది. తాజాగా ప్రముఖ టెక్ కంపెనీ ఐబీఎం తీసుకున్న నిర్ణయం చూస్తుంటే.. భవిష్యత్తులో అనేక ఉద్యోగాల్లో ఏఐ తిష్ట వేస్తుందనే అంచనాలు నిజమేనని అనిపిస్తోంది. ఇంతకీ ఐబీఎం కంపెనీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే..?

రానున్న ఐదేళ్లలో కంపెనీలోని చాలా ఉద్యోగాల స్థానంలో కృత్రిమ మేధను ఉపయోగించాలని ఐబీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఆ మేరకు ఆయా విధుల్లోకి కొత్త ఉద్యోగులను తీసుకోవడం ఆపేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తగిన మార్పులు చేయాలని సంబంధిత ఉన్నతోద్యోగులకు కంపెనీ సీఈఓ అర్వింద్‌ కృష్ణ సూచించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ బ్లూమ్‌బెర్గ్‌ కథనం ప్రచురించింది.

దాదాపు 7,800 మంది ఉద్యోగుల స్థానంలో ఏఐని వినియోగించే అవకాశాలు ఉన్నాయని తాను భావిస్తున్నట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐబీఎం సీఈఓ చెప్పినట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. అయితే, ఐబీఎం ఓవైపు ఉద్యోగులను తొలగిస్తూనే మరోవైపు నియామకాలను సైతం కొనసాగిస్తోంది. తొలి త్రైమాసికంలో దాదాపు 7000 మంది కొత్త వారిని కంపెనీలోకి ఆహ్వానించినట్లు సీఈఓ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version