అశ్విన్ వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ హిస్టరీలోనే తొలిసారి!

-

ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలి రోజు మ్యాచులో టాపార్డర్ మొత్తం కుప్పకూలగా.. స్పిన్నర్ అశ్విన్ అద్భుతమే చేశాడని చెప్పుకోవచ్చు. అతితక్కువ బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించాడు. అశ్విన్ ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను ఎంతగానో మెప్పించింది.

అయితే, చెన్నై వేదికగా బంగ్లాదేశ్ మీద అశ్విన్ సెంచరీ నమోదు చేయడంతో ప్రపంచ రికార్డు క్రియేట్ అయ్యింది. 20 సార్లు 50 కంటే ఎక్కువగా పరుగులు, 30కు పైగా సందర్బాల్లో 5 వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా అశ్విన్ నిలిచాడు. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఈ ఫీట్ సాధించడం విశేషం. అశ్విన్ 101 మ్యాచుల్లో 14 హాఫ్ సెంచరీలు, 6 సెంచరీలు, 36 సార్లు 5 వికెట్లు, 8 సార్లు 10 వికెట్లు తీశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version