2021లో హాట్ కేకుల్లా మార‌నున్న జాబ్‌లు ఇవే.. రూ.ల‌క్ష‌ల్లో వేత‌నం పొంద‌వ‌చ్చు..

-

ప్ర‌పంచమంతా డిజిట‌ల్ దిశ‌గా మార్పులు చెందుతోంది. అందులో భాగంగానే నైపుణ్యం ఉన్న వారికి పుష్క‌లంగా ఉద్యోగ అవ‌కాశాలు ల‌భిస్తున్నాయి. అయితే క‌రోనా నేప‌థ్యంలో కంపెనీలు మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే ఉద్యోగాల‌ను ఇస్తున్నాయి. దీంతో 2021లో అంతా బాగుంటుంద‌ని ఉద్యోగులు ఆశిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఏడాదిలో ప‌లు ఉద్యోగాల‌కు డిమాండ్ పెరిగే అవ‌కాశం ఉంద‌ని, అలాగే ఆ ఉద్యోగాల‌ను పొందే వారు భారీ ఎత్తున వేత‌నాలు పొందేందుకు కూడా అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి 2021లో అత్య‌ధిక వేత‌నాల‌ను అందించే ఉద్యోగాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

* డేటా సైంటిస్టుగా రాణించే వారికి వ‌చ్చే ఏడాది పుష్క‌లంగా అవ‌కాశాలు ఉంటాయ‌ని చెప్ప‌వ‌చ్చు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌, ఎస్‌క్యూఎల్‌, పైథాన్‌, ఆర్‌, జావా, అపాచె హైవ్‌, పిగ్‌, స్పార్క్ వంటి అంశాల్లో నైపుణ్యం ఉంటే అమెరికా, ఇండియాల్లో ఏడాదికి రూ.90 ల‌క్ష‌ల వేత‌నంతో ఉద్యోగాలు ల‌భించేందుకు అవ‌కాశం ఉంటుంది.

* ప్రొడ‌క్ట్‌ల‌ను డెవ‌ల‌ప్ చేసి ఆర్గ‌నైజ్ చేసే మేనేజ‌ర్ల‌కు అయితే ఏడాదికి రూ.1 కోటి వ‌ర‌కు వేత‌నం ఇస్తారు.

* క్లౌడ్ ఆర్కిటెక్ట్ ఉద్యోగాలు చేసే వారు ఆ రంగంలో మ‌రింత నిపుణ‌త సాధిస్తే ఉద్యోగాల్లో ఏడాదికి రూ.30 ల‌క్ష‌ల నుంచి రూ.50 ల‌క్షల వ‌ర‌కు వేత‌నాలు పొంద‌వ‌చ్చు.

* హెచ్‌టీఎంఎల్‌, సీఎస్ఎస్‌, జావా స్క్రిప్ట్‌, రూబీ, పీహెచ్‌పీ, పైథాన్, డాట్ నెట్‌, మై ఎస్‌క్యూఎల్‌, ఒర‌కిల్‌, మోంగో డీబీ వంటి అంశాల్లో ప్రావీణ్యులు అయితే ఏడాదికి రూ.35 ల‌క్ష‌ల జీతంతో ఉద్యోగాల‌ను పొంద‌వ‌చ్చు.

* బిగ్ డేటా ఇంజినీర్లు ఏడాదికి రూ.30 ల‌క్ష‌ల వ‌ర‌కు వేత‌నం పొందేందుకు అవ‌కాశం ఉంటుంది.

* డెవ్ ఓపీఎస్ మేనేజ‌ర్ పోస్టుల్లో అయితే ఏడాదికి రూ.40 ల‌క్ష‌ల వ‌ర‌కు వేత‌నం పొందొచ్చు.

* బ్లాక్ చెయిన్ డెవ‌ల‌ప‌ర్లు రూ.22 ల‌క్ష‌లు, మొబైల్ అప్లికేష‌న్ డెవ‌ల‌ప‌ర్లు రూ.30 ల‌క్ష‌లు, ఆర్‌పీఏ డెవ‌ల‌పర్లు రూ.11 ల‌క్ష‌లు, ఇన్ఫ‌ర్మేష‌న్ సెక్యూరిటీ అన‌లిస్ట్ పోస్టుల‌కు రూ.30 ల‌క్ష‌ల వార్షిక వేత‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version