కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిస్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. భూస్వామిలా వ్యవహరిస్తారని, సీరియస్‌నెస్ లేని వ్యక్తిని రాహుల్ పై విమర్శలు చేశారు. బాధ్యత లేకుండా అధికారం కావాలని కోరుకుంటారని, రాహుల్ రాజకీయాలకు సరిపోరని వ్యాఖ్యానించారు.
‘రాజకీయంగా సీరియస్‌నెస్ లేని వ్యక్తి రాహుల్ గాంధీ. ఆయన రాజకీయాలకు పనికిరారు. ఏపనైతే చేయకూడదో.. ఆయన అదే చేస్తున్నారు’ అని అస్సాం సీఎం అన్నారు. ‘ఓ మీటింగ్‌లో నుంచి ఉన్నట్టుండి లేచి బయటకు జాగింగ్‌కు వెళతారు. లేదా పక్కనున్న గదికి వెళ్లిపోయి అర్ధగంట తర్వాత బయటకు వస్తారు. ఆయనకు క్రమబద్ధమైన ప్రణాళిక లేదు’ అని దుయ్యబట్టారు.
‘లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ.. రాహుల్ అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకున్నారు. కానీ, ఈరోజు భారత్ జోడో యాత్రతోపాటు పార్టీనీ ఆయనే నడిపిస్తున్నారు. అంటే జవాబుదారీతనం లేకుండా అధికారాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడు కాకపోయినా అన్ని నిర్ణయాలు తీసుకుంటారు’ అంటూ విమర్శించారు.