ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన తర్వాత ఆమోదం పొందిన తర్వాత వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టారు. మంత్రి మేకపాటి గౌతం రెడ్డి ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కూడా వెనక్కు తగ్గేది లేదు అంటూ కూడా స్పష్టం చేసింది. కచ్చితంగా విక్రయిస్తామని కూడా కేంద్రం పేర్కొన్న సంగతి తెలిసిందే.