కార్లు ఉన్న వారికి కేంద్రం శుభవార్త.. టోల్ ప్లాజాపై ప్రకటన !

-

కార్లు ఉన్న వారికి కేంద్రం శుభవార్త.. టోల్ ప్లాజాపై ప్రకటన చేసింది కేంద్రం. జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే మధ్య తరగతి, ప్రైవేటు కార్ల యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వీరి కోసం ఏడాదికి రూ.3000, 15 ఏళ్లకు రూ.30000తో కొత్త పాసులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. వీటితో దేశంలోని ఏ జాతీయ రహదారిపైనైనా ఎన్నిసార్లైనా తిరగొచ్చు. ప్రస్తుతం రూ. 340 పాసుతో ఒక టోల్ ప్లాజాలోనే వెళ్లాలనే రూల్ ఉన్న సంగతి తెలిసిందే.

The central government has given good news to the middle class and private car owners who frequently travel on national highways

ఇక అటు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఆదాయపు పన్ను చెల్లింపుదారుల వివరాలను ఆహార మంత్రిత్వ శాఖతో ఐటీ విభాగం పంచుకోనుంది. కేంద్రం.. ఆధార్‌, పాన్‌, మదింపు సంవత్సరం వివరాలను సమర్పిస్తే.. నిర్ణీత మొత్తం కంటే ఆదాయం కలిగిన వారు ఉంటే వారి డేటాను డీజీఐటీ సిస్టమ్స్‌ అందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version