ఆదాయ పన్ను కడితే… ఇక ఉచిత రేషన్ కట్‌ !

-

దేశంలోని ప్రజలకు కేంద్రం షాక్‌ ఇచ్చేలా కనిపిస్తోంది. ఆదాయ పన్ను కడితే ఇక నో రేషన్ అనే నిబంధనలు తీసుకువచ్చే ప్లాన్‌ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆడుగులు వేస్తోంది. ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన లబ్ధిదారుల్లో అనర్హులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటోంది.

If income tax is paid then free ration cut

ఆదాయపు పన్ను చెల్లింపుదారుల వివరాలను ఆహార మంత్రిత్వ శాఖతో ఐటీ విభాగం పంచుకోనుంది. కేంద్రం.. ఆధార్‌, పాన్‌, మదింపు సంవత్సరం వివరాలను సమర్పిస్తే.. నిర్ణీత మొత్తం కంటే ఆదాయం కలిగిన వారు ఉంటే వారి డేటాను డీజీఐటీ సిస్టమ్స్‌ అందిస్తుంది.

ఇక అటు జాతీయ రహదారులపై తరచూ ప్రయాణం చేసే మధ్య తరగతి, ప్రైవేటు కార్ల యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వీరి కోసం ఏడాదికి రూ.3000, 15 ఏళ్లకు రూ.30000తో కొత్త పాసులు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలి. వీటితో దేశంలోని ఏ జాతీయ రహదారిపైనైనా ఎన్నిసార్లైనా తిరగొచ్చు. ప్రస్తుతం రూ.340 పాసుతో ఒక టోల్ ప్లాజాలోనే వెళ్లాలనే రూల్ ఉన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version