కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. గడిచిన రెండు రోజుల నుంచి కేరళ రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షాలు కొడుతున్నాయి. ఇక భారీ వర్షాల నేపథ్యం లో కేరళ రాష్ట్రం లో ఏకంగా 7 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది విజయన్ రాష్ట్ర ప్రభుత్వం. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది కేరళ సర్కార్.
ఇది ఇలా ఉండగా… ఇప్పటి వరకు కేరళ రాష్ట్రం లోని ఆయా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడి ఏకంగా 26 మంది మృతి మృతి చెందిన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే.. పలువురు గల్లంతు కూడా అయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ సీఎం విజయన్ పిలుపునిచ్చారు. బాధితుల పునరావాసం కోసం 105 శిబిరాలను ఏర్పాటు చేసినట్లు ప్రకటన చేశారు.