సిరిసిల్లా జిల్లాలో కలకలం : మృతి చెందిన వ్యక్తులకు కరోనా వ్యాక్సిన్‌ !

-

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చాలా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే.. కొన్ని ప్రాంతాల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా… వేసిన వ్యక్తికే రెండు సార్లు వ్యాక్సిన్‌ వేయడం.. కరోనా ఉన్న వారికి వ్యాక్సిన్‌ వేయడం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

ఇలాంటి నేపథ్యం లోనే కేటీఆర్‌ ఇలాకా అయిన.. రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వ్యక్తికే కరోనా వ్యాక్సిన్‌ వేసింది వైద్య సిబ్బంది. అదేంటి అనుకుంటున్నారా ? ఈ ఘటన వివరాల్లోకి వెళితే… రాజన్న సిరిసిల్ల జిల్లా లోని.. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో రెండు నెలల క్రితం మృతి చెందిన ఓ వ్యక్తికి.. తాజా గా కోవిడ్ టీకా వేసినట్లు రికార్డుల్లో నమోదు చేసింది వైద్య సిబ్బంది.

అలాగే… అదే జిల్లాలోని బోయినిపల్లి మండల కేంద్రంలో ఓ వ్యక్తి మే నెలలో చనిపోతే… అక్టోబర్ 12 నాడు రెండవ డోసు వాక్సినేషన్ పూర్తి చేసినట్లు మెస్సేజ్ లు పంపింది వైద్య ఆరోగ్య శాఖ. దీంతో ఆయా కుటుంబ సభ్యులు తీవ్ర గందర గోళానికి గురయ్యారు. అయితే… దీనిపై రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు… దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై ప్రజలు తీవ్ర స్థాయిలో వైద్యులపై మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version