ఏపీలో వర్షాలు, వరదలు కారణంగా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని… తెలిపారు అచ్చెన్నాయుడు. సీఎం జగన్.. ఇకనైనా బురద రాజకీయాలు ఆపి వరద బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వేలాది ఎకరాల్లో పంట నష్టంతో పాటు, ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని… కడప జిల్లాలో 30 మంది గల్లంతవ్వగా 12 మంది చనిపోయారని తెలిపారు.
ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు..? రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదల వల్ల ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో బిక్కుబిక్కుమంటు రోడ్లపై ఉన్నారన్నారు. సీఎం జగన్ వరదల పై శద్ర పెట్టకుండా బురద రాజకీయాలు చేస్తూ ఎదుటివారిపై బురద చల్లే ప్రయత్నం సిగ్గుచేటు అని ఆగ్రహించారు.
జగనుకి కుప్పంలో దొంగ ఓట్లు వేయించటంపై ఉన్న శ్రద్ద వరద బాధితులను ఆదుకోవటంలో లేదని ఫైర్ అయ్యారు. చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణమే ఆర్దిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం శ్రమించి చేతికందిన పంట నీట మునగటంతో అన్నదాతలు ఆవేదన, ఆందోళన చెందుతున్నారన్నారు. వరదల వల్ల అన్ని కోల్పోయి ఆపన్న హస్తం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారని తెలిపారు.