మధ్యప్రదేశ్ ను వణికిస్తున్నడెంగ్యూ కేసులు.

-

కరోనాతో దేశం సతమతమవుతుంటే.. మరోవైపు సీజనల్ వ్యాధులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జీకా వైరస్ కేసులు తీవ్ర రూపం దాలిస్తే, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను డెంగ్యూ కేసుల సంఖ్య తీవ్రమవుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో డెంగ్యూతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఇండోర్ నగరంలో తాజాగా శుక్రవారం ఒక్కరోజే పదిమంది పిల్లలతో సహా 21 మందికి డెంగీ సోకింది. వీరిలో 10 పిల్లలు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఇప్పటి వరకు ఇండోర్ నగరంలో దాదాపు డెంగ్యూ కేసుల సంఖ్య 1000కి చేరింది. ప్రస్తుతం 28 యాక్టివ్ డెంగ్యూ కేసులు ఉన్నాయి. జిల్లాలో 15 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ముఖ్యంగా దోమల వల్ల డెంగ్యూ వ్యాధి ప్రబలుతుంది. ఇండోర్ నగరంలో మురికినీరు చేరడంతో దోమల లార్వా విపరీతంగా పెరింది. దీంతో ప్రజలు డెంగ్యూ వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో ప్రభుత్వం డెంగీ నివారణకు వీలుగా దోమలు వ్యాప్తి చెందకుండా యాంటీలార్వా ఆపరేషన్ చేపట్టారు. గర్భిణీ స్త్రీలు డెంగ్యూ బారిన పడినట్లయితే, పిండం పెరుగుదల మీదప్రభావం చూపిస్తుంది. శిశువు తక్కువ బరువుతో బాధపడే అవకాశాలు ఉన్నాయని  గైనకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version