వైసీపీ ప్లీనరీ కాదు డ్రామా గ్యాలరీ – అచ్చెన్నాయుడు

-

వైసీపీ ప్లీనరీ కాదు డ్రామా గ్యాలరీ అని అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్లీనరీ పేరుతో జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని.. 2 రోజుల ప్లీనరీ – ఆర్టీసీకి రూ.10 కోట్లు నష్టమని ఫైర్‌ అయ్యారు. ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉందని 3 సార్లు చార్జీలు పెంచారని… ప్రతిపక్ష పార్టీల సభలకు అడ్డంకులు సృష్టించే ప్రభుత్వం నేడు వైసీపీ ప్లీనరీకి మాత్రం మర్యాదలు చేస్తున్నారని వెల్లడించారు.

అధికారపక్షానికి ఒక న్యాయం ప్రతిపక్షానికి మరొక న్యాయమా..? తెలుగుదేశం పార్టీ మహానాడు ఆర్టీసీ, ప్రైవేట్ వాహనాలకు అనుమతి ఇవ్వలేదు… రాజధాని రైతుల పాదయాత్రకు అనుమతివ్వలేదని నిప్పులు చెరిగారు. ప్లీనరీకి మాత్రం రెడ్ కార్పెట్ వేసి మరి సేవలు చేస్తున్నారు… నిబంధనలకు విరుద్ధంగా నాగార్జున యూనివర్సిటీకి సెలవులిచ్చారు… స్కూల్ బస్సులు, ప్రైవేట్ వాహనాలను బలవంతంగా లాక్కుంటున్నారన్నారు. డ్వాక్రా మహిళలను బెదిరించి ప్లీనరీకి తరలిస్తున్నారని మండిపడ్డారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version