బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే.. దీంతో ఆయనకి మెరుగైన చికిత్స అందించేందుకు పాట్నా నుంచి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం తన నివాసంలో మెట్లపై నుండి పడిపోవడంతో ఆయన కుడి భుజం ఎముక విరిగింది. దాంతో కుటుంబ సభ్యులు ఆయనను పాట్నాలోని ఫారస్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిడ్స్ కి తీసుకెళ్లినట్లు ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ తెలిపారు.
అయితే తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం కాస్త మెరుగుపడి నట్లు ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ తెలిపారు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఆసుపత్రిలో లాలూ కిచిడీ తిన్నారని చెప్పారు. కుటుంబ సభ్యులతో ను మాట్లాడారని కేవలం పడుకున్నప్పుడు మాత్రమే డాక్టర్లు ఆక్సిజన్ సపోర్టు ఇస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఐసియు నుంచి జనరల్ వార్డుకు తరలించే అవకాశం ఉందన్నారు తేజస్వి యాదవ్.