వైసీపీ నేతలంతా ”కాలకేయులు”..వాళ్లే రేప్‌లు చేస్తారు : అచ్చెన్నా

-

వైసీపీ నేతలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతలవి నీచ రాజకీయాలు అని.. ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలనూ రాజకీయ లబ్ధికి వాడుకోవడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. విజయవాడలో బాలిక ఆత్మహత్య ఘటన బాధాకరమని.. నిందితుడు వినోద్ జైనును పార్టీ నుంచి సస్పెండ్ చేశామని గుర్తు చేశారు.

ఆడ బిడ్డలకు అండగా నిలబడటం చేతకాని వైసీపీ నేతలు మాపై విమర్శలా? అని నిలదీశారు. సీఎం జగన్ చేతకాని తనం మహిళల పాలిట శాపంగా మారిందని..కాలకేయుల మాదిరి వైసీపీ నేతలు ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రెండున్నరేళ్లలో ఒక్క కిరాతకుడి పైనా చర్య ల్లేవని ఆగ్రహించారు. ఇంటి నుంచి బయటకు రావాలం టేనే మహిళలు భయపడే పరిస్థితి ఉందని చెప్పారు. నేరస్థులకు అండగా పోలీసులు నిలుస్తున్నారు సంచలన ఆరోపణలు చేశారు అచ్చెన్నాయుడు. వైసీపీ పార్టీ నేతలు ఏదో తాము.. మంచి వాళ్లమనే..భ్రమలో ఉన్నారని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version