సంకాంత్రి పండుగ పర్వదినాన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలు, ఆత్మహత్యలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే కనుమ పండుగ నాడు విశాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒంటికి నిప్పు అంటించుకొని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
స్థానికుల కథనం ప్రకారం.. లక్ష్మీ ప్రసన్న అనే మహిళ గత కొంతకాలంగా ఫ్యామిలీ గొడవలతో తన భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె వెంట తన రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. బుదవారం కుమారుడిని తన తల్లి వద్ద ఉంచి ఇంట్లో ఎవరూ లేని టైంలో ఒంటికి నిప్పు అంటించుకొని లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.