ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్.. కేజ్రీవాల్‌కు షాకిచ్చిన కేంద్రహోంశాఖ

-

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్‌ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర హోంశాఖ షాక్ ఇచ్చింది. గతంలో కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆయన్ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు కేంద్రం అనుమతులిచ్చింది.

మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను విచారించేందుకు ఈడీకి అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.కేజ్రీవాల్ ను విచారించేందుకు అనుమతి ఇస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పర్మిషన్ ఇవ్వడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా,
ప్రజాప్రతినిధులను విచారించాలంటే ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్‌లో ఇచ్చిన ఆదేశాల మేరకు లెఫ్టి గవర్నర్ ఆమోదం రాగానే కేంద్ర హోంశాఖ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version