జవహర్ నవోదయ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థి తల పగలగొట్టాడు ప్రిన్సిపల్. ఈ సంఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ స్కూల్లో జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి స్టడీ అవర్స్ లో మహేష్ అనే విద్యార్థిపై ఇంచార్జ్ ప్రిన్సిపల్ పెత్తనస్వామి దాడి చేశాడు.

దాడి అనంతరం విద్యార్థిని వాష్ రూమ్ లో లాక్ వేశాడు. ఉదయం దాక లాక్ తియ్యొద్దని స్టాఫ్ ని హెచ్చరించారు ఇన్చార్జ్ ప్రిన్సిపల్. ఉపాధ్యాయుల చొరవతో బాలుడిని చికిత్స కొరకు మర్రిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ సంఘటన పై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకునే ఛాన్సులు ఉన్నాయి.