ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే స్థాయి వైసిపి నేత రోజాకు లేదని మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అవుతున్నారు. నువ్వు మంత్రిగా ఉండి కూడా జబర్దస్త్ లో పాల్గొన్నావని మంత్రి కందుల దుర్గేష్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు డబ్బు ఆశ లేదు సినిమా ద్వారా వచ్చిన డబ్బులను కూడా అతను ప్రజలకే ఖర్చు చేస్తున్నారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ అయినా రాష్ట్రానికి తీసుకువచ్చారా అని అన్నారు.

ప్రజా సమస్యలను ఎప్పుడైనా పట్టించుకున్నారా వారి బాధలను అర్థం చేసుకున్నారా అంటూ మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు. ఈ విషయం పైన రోజా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. రోజా ఓవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలలో, షోలలో పాల్గొన్నారు. కొద్ది రోజుల తర్వాత రాజకీయాలలో బిజీగా ఉండడం వల్ల సినిమా షూటింగ్లను పూర్తిగా మానేశారు. మళ్లీ ఇప్పుడు యధావిధిగా షోలలో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో రోజాపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. మళ్లీ షోలలో నటించడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.