గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది.పెళ్లికి సాయం చేస్తానని నమ్మించి యువతిపై ఓ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకివెళితే.. జూబ్లిహిల్స్‌లోని ఓ బంగ్లాలో వాచ్‌మెన్ అతని కూతురు (19) ఉంటున్నారు. ఈ క్రమంలోనే అదే బంగ్లాలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి వాచ్ మెన్ కూతురి పెళ్లికి సాయం చేస్తానని నమ్మబలికినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నిన్న రాత్రి యువతి ఒంటరిగా ఉండటం చూసి ఆమె గదిలోకి వచ్చాడు. పెళ్లి టాపిక్ తీసి ఆమెను ఏమార్చి బలవంతం చేశాడు. దిండుతో నోరు నొక్కేసి యువతిపై డ్రైవర్ అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది.దీంతో బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.