గ్యాస్ లీక్ అవడం వలన ఓ మహిళకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్వీన్ కాలనీ డివిజన్ పాపిరెడ్డి నగర్‌లో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. రోడ్డు నెంబర్ 12 సి బ్లాక్‌లోని ఓ ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయ్యి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో సువర్ణ అనే మహిళకు మంటలు అంటుకుని తీవ్ర గాయాలు అయ్యాయి.స్థానికులు చాకచక్యంగా గ్యాస్ సిలిండర్‌ను బయటకు తీసుకువచ్చి మంటలను ఆర్పివేశారు. అనంతతరం పోలీసులకు సమాచారం అందజేయగా.. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.