సూర్యాపేటలో దారుణం.. స్నేహితురాలిని ప్రియుడితో అత్యాచారం చేయించిన యువతి

-

సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సభ్యసమాజం తలదించుకునేలా ఓ యువతి ప్రవర్తించింది. తన స్నేహితురాలికి మద్యం తాగించి ఆమె స్పృహ కోల్పోయాక తన ప్రియుడితో అత్యాచారం చేయించింది. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ గ్రామానికి చెందిన రోజా తన స్నేహితురాలు (26)ని ఇంటికి పిలిచి మద్యం తాగించింది. మత్తులోకి వెళ్ళాక తన ప్రియుడు ప్రమోద్‌తో ఆమెపై అత్యాచారం చేయిస్తూ వీడియో తీసింది. మరొకసారి యువతిని పిలిపించిన రోజా.. ఈసారి తన స్నేహితుడు హరీష్ కోరిక తీర్చాలని యువతిని దారుణంగా కొట్టింది. ఎంత కొట్టినా ఆ యువతి నిరాకరించి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news