ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు చాలా రసవత్తరంగా మారాయనే చెప్పాలి. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాయి. అయితే కూటమిలో మాత్రం విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ప్రధానంగా జనసేన-టీడీపీ మధ్య కొన్ని చోట్ల పలు సందర్భాల్లో పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల డిప్యూటీ సీఎం నారా లోకేష్ అంటూ టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే.
ఇదిలా ఉండగా.. తాజాగా జనసేన పార్టీలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధానంగా తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ లీలలు బయటపడ్డాయి. అమాయక మహిళని బెదిరించి, మోసం చేసి, అన్ని విధాలుగా వాడుకొని, కోటి రోపాయలకు పైగా డబ్బులు కాజేసినట్టు సమాచారం. కిరణ్ రాయల్ కారణంగా తాను మోసపోయానని ఓ మహిళా ఆత్మహత్య చేసుకుంటాను అని పేర్కొంటుండటం గమనార్హం. తిరుపతిలో మహిళ పై కిరణ్ అరాచకాలు చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదంటున్నారు తిరుపతి వాసులు. ఈ ఘటన పై జనసేన అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి మరీ.
దారుణం..
బయటపడ్డ తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ లీలలు
అమాయక మహిళని బెదిరించి, మోసం చేసి, అన్ని విధాలుగా వాడుకొని, కోటి రోపాయలకు పైగా డబ్బులు కాజేసిన కిరణ్ రాయల్
ఆత్మహత్య చేసుకుంటాను అంటున్న మహిళ
తిరుపతిలో కిరణ్ అరాచకాలు చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదంటున్నా తిరుపతి… pic.twitter.com/yiTZ9ATq9A
— greatandhra (@greatandhranews) February 8, 2025