ప‌శ్చిమ గోదావ‌రిలో దారుణం..మహిళ చీరలాగి దౌర్జన్యం చేసిన రౌడీలు

-

మహిళ చీరలాగి దౌర్జన్యం చేశారు రౌడీలు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. చనిపోయే ముందు కూతురు వరుసయ్యే మేడపాటి రోజాకు ఆస్తిగా తన ఇంటిని ఇస్తూ వీలునామా రాశారు కొల్లి సుశీల. అయితే.. ఆ ఆస్తి తనదేనంటూ మేడపాటి రోజా కుటుంబంతో ఘర్షణ పడుతున్నారు సుశీల మరిది కొడుకు కొల్లి సుందరం.

Atrocity in West Godavari Rowdies dressed in sarees assaulted a woman
Atrocity in West Godavari Rowdies dressed in sarees assaulted a woman

ఇటీవల 30 మంది రౌడీలను తీసుకొచ్చి ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. రోజా ఇంటిలోని ఫర్నీచర్, సామాన్లు రోడ్డుపై పడేశారు రౌడీలు. ఈ క్రమంలో రౌడీలు తన చీర లాగేశారని ఆరోపించారు బాధితురాలు రోజా. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్య‌క్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కార్యాల యాన్ని ఆశ్రయిం చారు మేడపాటి రోజా.

Read more RELATED
Recommended to you

Latest news