ల్యాబ్‌కు హాజరు కావడం లేదని అడిగినందుకు.. ప్రొఫెసర్‌పై కత్తితో విద్యార్థి దాడి చేశాడు. ఈ సంఘటన
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో చోటు చేసుకుంది. సక్రమంగా ల్యాబ్ క్లాసులకు ఎందుకు హాజరు కావడం లేదని విద్యార్థిని ప్రశ్నించారు ఎంటెక్ డిపార్ట్మెంట్ ఇన్‌ఛార్జి, ప్రొఫెసర్ గోపాలరాజు. దీంతో
కోపోద్రిక్తుడైన ఆ విద్యార్థి.. ఇన్‌ఛార్జిపై కత్తితో దాడి చేశాడు.

ఈ తరుణంలోనే… సహచర సిబ్బంది ప్రొఫెసర్‌ను నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రొఫెసర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాడి ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే… ప్రొఫెసర్‌పై కత్తితో విద్యార్థి దాడి చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.