దసరా శరన్నవరాత్రి వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. కాగా దసరా పండుగ సందర్భంగా ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు స్కూళ్లకు సెలవులు ఇవ్వబోతున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. దీంతో 13 రోజులపాటు అన్ని స్కూళ్లకు సెలవులు ఇవ్వబోతున్నారు. తిరిగి అక్టోబర్ 4న పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి. యధావిధిగా అక్టోబర్ 4 నుంచి తరగతి క్లాసులు చెబుతారు.

ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ఇవ్వనున్నారు. బతుకమ్మ పండుగను తెలంగాణలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పూలతో పండుగను చేసుకునే సంప్రదాయం తెలంగాణలో మాత్రమే ఉంది. ఎంతో వైభవంగా బతుకమ్మ, దసరా వేడుకలు చేసుకుంటారు. అనేక రకాల పూలతో గౌరమ్మను అలంకరిస్తారు. అలా చేయడంవల్ల వారి ఇంట్లో సిరిసంపదలు వెదజల్లుతాయని ఆశ భావం వ్యక్తం చేస్తారు.