జనసేన నాయకుడి కుటుంబంపై దాడి.. మహిళను ఇడ్చుకుంటూ!

-

ఏపీలో దారుణం చోటుచేసుకుంది. జనసేన పార్టీలో పనిచేస్తున్న నాయకుడి కుటుంబంపై ఓ వర్గం వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆండ్రంగి గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

అంతకుముందు పంచాయతీ చెరువు ఆక్రమణలను తొలగించాలని కాకినాడ కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో గాలిదేవర అమర్నాథ్ ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన ప్రత్యర్థులు అమర్నాథ్ కుటుంబంపై దాడి చేశారు. దాడి చేసిన వారిని సత్తింశెట్టి సూర్యనారాయణ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. వీరు మహిళ అని కూడా చూడకుండా గాలిదేవర రత్న కుమారి జుట్టు పట్టుకుని లాక్కుని పోవడంతో పాటు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కాగా, దాడి చేసిన నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.

https://twitter.com/bigtvtelugu/status/1899715063327637851

Read more RELATED
Recommended to you

Latest news