రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్ పై కర్ణాటకలో దాడి జరిగింది. బెంగుళూరులో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన ముఖం పై కొందరు సిరా చల్లి దాడి చేశారు. టికాయత్ తో పాటు యుద్వీర్ సింగ్ ముఖం పై నల్ల సిరా చల్లింది ఆయన వ్యతిరేక వర్గమే అని తెలుస్తోంది. అంతేకాదు ఆయనపై కుర్చీలు విసిరారు నిరసనకారులు. ఈ క్రమంలో అక్కడ ఉన్న వాళ్ళు దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
కర్ణాటక రైతు నేత కొడిహల్లి చంద్రశేఖర్ డబ్బులు తీసుకుంటూ స్థానిక మీడియా స్టింగ్ ఆపరేషన్ కు పట్టుబడ్డారు. ఈ ఘటన పై రాకేష్ టికాయత్,యుద్వీర్ సింగ్ లు వివరణ ఇచ్చే సమయంలోనే దాడి జరిగింది. ఆ ఘటనలో తమ ప్రమేయం లేదంటూ వాళ్లు వివరణ ఇవ్వబోతుండగా.. కొందరు వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే దాడికి పాల్పడింది చంద్రశేఖర్ మద్దతుదారులేనని రాకేష్ టికాయత్ చెబుతున్నారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ink thrown at Rakesh Tikait pic.twitter.com/B7hEukCHX3
— Gurpreet Garry Walia (@_garrywalia) May 30, 2022