మొదలైందండి మళ్ళీ పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతల మాటల దాడి..పవన్ ఏమో ఆవిర్భావ సభలో వైసీపీనే టార్గెట్ చేసి విమర్శలు చేశారు…జగన్ ప్రభుత్వం వాళ్ళ అంతా నాశనం అన్నట్లే మాట్లాడారు..ఒకటి ఏంటి అన్నీ కోణాల్లోనూ వైసీపీపై విమర్శలు గుప్పించారు..సరే పవన్ అన్నీ విమర్శలు చేశాక వైసీపీ నేతలు ఊరుకుంటారా…పవన్ సభ అయిన వెంటనే..
పేర్ని నాని మీడియా సమావేశం పెట్టి పవన్ కు కౌంటర్లు ఇచ్చేశారు…ఎప్పటిలాగానే..పవన్, చంద్రబాబు స్క్రిప్ట్ చదివారని చెప్పి విమర్శించారు. అలా వెంటవెంటనే వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి అవంతి శ్రీనివాస్ ఇలా వరుసపెట్టి వైసీపీ మంత్రులు నాయకులు మీడియా సమావేశాలు పెట్టడం పవన్ పై ఫైర్ అవ్వడం చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ అట్టర్ ఫ్లాప్ హీరో అని, ఆయన అన్నీ సినిమాలు ఫెయిలే అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు అహంభావమని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సినిమాలో గబ్బర్ సింగే ..కానీ నిజ జీవితంలో రబ్బర్ సింగ్ అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ చురకలంటించారు.
అంతకముందు పేర్ని నాని సైతం తనదైన శైలిలో పవన్ పై ఫైర్ అయ్యారు..పవన్ పూర్తిగా బాబు స్క్రిప్ట్ చదువుతున్నారని అన్నారు. జగన్ అమలు చేస్తున్న మంచి సంక్షేమ పథకాలు కనిపించడం లేదా? అని ఫైర్ అయ్యారు. ఇదే సమయంలో వైసీపీ నేతలంతా తెలివిగా ఒక కాన్సెప్ట్ ని తెరపైకి తీసుకొస్తున్నారు. అదేంటి అంటే టీడీపీ-జనసేన-బీజేపీ-కాంగ్రెస్-సిపిఐ -సిపిఎం ఇలా అన్నీ పార్టీలు కలిసి పోటీ చేయడానికి చూస్తున్నాయని, అంటే జగన్ ఒక్కడిపై అందరూ కలిసి కుట్ర పన్నుతున్నారనే సెంటిమెంట్ కోణాన్ని తెరపైకి తీసుకోస్తున్నట్లు కనిపిస్తోంది. అంటే ప్రభుత్వం చేసే తప్పులని హైలైట్ కాకుండా…ప్రతిపక్షాలు ఏకమయ్యి ఒక్కడిని టార్గెట్ చేస్తున్నారనే అంశాన్ని చూపిస్తున్నారు…దీని ద్వారా సెంటిమెంట్ లేపి రాజకీయంగా బెనిఫిట్ పొందేందుకు వైసీపీ బాగానే స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది. |
సేనానిపై ‘ఫ్యాన్స్’ ఎటాక్..కొత్త స్కెచ్!
-