మెదక్ మండలం తిమ్మానగర్‌లో అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తగా దగ్ధమై పోలబోయిన మంగమ్మ అనే మహిళ సజీవదహనమైంది. భర్త నర్సింలు, కుమారుడు రవికి తీవ్రగాయాలయ్యాయి. వారిని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెదక్ అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పినా ఫలితం లేకుండా పోయింది. మంటలు ఎలా అంటుకున్నాయన్నది తెలియరాలేదు. మంగమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.