కలెక్టర్ పై దాడి.. ఉద్యోగుల పెన్ డౌన్

-

వికారాబాద్ జిల్లా కలెక్టర్పై లగచర్ల గ్రామంలో సోమవారం ఉదయం జరిగిన దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. కలెక్టర్ మీద దాడి జరగడంపై రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్, డీజీపీలను ప్రభుత్వం ఆదేశించింది.మరో వైపు కలెక్టర్‌పై దాడి చేయడాన్ని ఖండిస్తూ నిరసనకు దిగిన అధికారులు వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై గ్రామస్థులు దాడి చేయడాన్ని ఖండిస్తూ కలెక్టర్ కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగిన అధికారులు. ఏకంగా కలెక్టర్‌పైనే దాడి చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించిన అధికారులు. రేపటి నుంచి పెన్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు.

నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేసిన అధికారులు. కలెక్టర్ పై  దాడి ఘటన మీద సీఎస్ శాంతికుమారి ఇప్పటికే ఆరా తీశారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ తో సీఎస్ ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై నివేదిక పంపాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎస్ ఆదేశించారు. ఫార్మా కంపెనీల కోసం భూ సేకరణ విషయమై వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీకై జైన్ లగచర్ల వెళ్లినపుడు గ్రామస్తులు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version