జొమాటో డెలివరీ బాయ్‌పై దాడి.. ఆ కులం వాడని చెప్పడంతోనే!

-

ఇటీవల ఫుడ్ డెలివరీ బాయ్స్ పై దాడులు దారుణంగా జరుగుతున్నాయి. ఫుడ్ బాగాలేదని కొందరూ.. టైంకు ఫుడ్ తీసుకుని రావట్లేదని కొందరు వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కులం, మతం పేరుతో కొందరు అసహ్యంగా ప్రవర్తించారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది. షెడ్యూల్ క్యాస్ట్ ‘(ఎస్సీ)కి చెందిన వ్యక్తి ఫుడ్ డెలివరీ తెచ్చాడని, ఆ ఫుడ్ మైలపడిందని వారు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమం డెలివరీ బాయ్‌పై ఉమ్మినట్లు, కులం పేరుతో దూషించినట్లు సమాచారం. తన వాహనాన్ని కూడా లాక్కున్నారని బాధితుడు పేర్కొన్నారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

జొమాటో డెలివరీ బాయ్‌

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జొమాటోలో నాలుగేళ్లుగా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న వినీత్‌కుమార్.. రోజు లాగానే ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లాడు. లొకేషన్ చేరుకున్నాక ఫుడ్ ఆర్డర్ పెట్టిన వ్యక్తులు.. తన పేరు, కులం అడిగారని ఆయన పేర్కొన్నాడు. అప్పుడు అంటరాని వ్యక్తి తెచ్చిన తిండిని తినమని చెప్పి.. ఆ ఫుడ్‌ని పడేసినట్లు వినీత్ తెలిపాడు. అలాగే తనను కొట్టడం, తనపై ఉమ్మడం చేశారని ఆయన వాపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version