రాబోయే ఎన్నికల్లో తాము ఓడిపోతున్నామనే డిప్రెషన్ తోనే బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ గుండాలు దాడి చేస్తున్నారని బీజీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. కాగ ఈ నెల 25న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. కాగ ఈ రోజు ఎంపీ బండి సంజయ్ నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ కు వెళ్లారు. అలాగే ఎంపీ ధర్మపురి అరవింద్ ను కలిసి దాడి కి సంబంధించిన వివరాలను అడగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు.
అందుకే ప్రతి ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తున్నారని అన్నారు. ఆ డిప్రెషన్ తోనే బీజేపీపై కేసీఆర్ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. అలాగే మూర్ఖుడి పాలనలోనే దాడులు జరుగుతాయని అన్నారు. సీఎం స్వయంగా దాడులు చేయమని చెబుతే రాష్ట్ర శాంతి భద్రతలు ఏంటి అని ప్రశ్నించారు. చార్మినార్ గడ్డ మీదనే తాము గర్జించామని ఆర్మూర్ ఒక లెక్కనా అని అన్నారు. దాడులు మాకు కొత్త కాదని అన్నారు. ఎన్ని దాడులు చేసినా.. ప్రజల తరపున తమ పార్టీ పోరాడుతుందని తెల్చి చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రజల కోసం తాముచావడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు.