రెండు అమెరికన్ వ్యాక్సిన్ తయారి కంపెనీలు నవంబర్ చివరి నాటికి తమ కరోనా వ్యాక్సిన్ల కోసం అత్యవసర ఆమోదం నిమిత్తం దరఖాస్తు చేసుకోవాలి అని భావిస్తున్నాయి. అమెరికాలో కరోనా కేసులు 8 మిలియన్లు దాటాయి. నవంబర్ 3 అధ్యక్ష ఎన్నికల నాటికి వ్యాక్సిన్ లు వస్తాయి అని ట్రంప్ చెప్తున్నారు. అయితే వ్యాక్సిన్ విషయంలో తాము రెడీ గా ఉన్నామని ఫైజర్, మోడెరనా ప్రకటించాయి.
అనుమతి వచ్చిన తర్వాత తాము ముందుకు వెళ్ళాలి అని భావిస్తుంది. మసాచుసెట్స్ బయోటెక్ సంస్థ మోడెర్నా నవంబర్ 25 నాటికి ఆమోదం మొదాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ రెండు వ్యాక్సిన్ లు రెడీ కానున్నాయి. నవంబర్ మూడో వారంలో వ్యాక్సిన్ ఎంత వరకు రక్షణగా ఉంటుంది అనేది తెలుస్తుంది అని ఫైజర్ ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో కంపెనీ షేర్లు భారీగా పెరిగాయి. టీకాలు ఆమోదించబడినప్పటికీ, అవి విస్తృతంగా లభించడానికి చాలా నెలలు పడుతుందని నిపుణులు చెప్తున్నారు.