విమాన ప్రయాణాల విషయంలో అన్ని దేశాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా ఒక దేశం మన దేశానికి చెందిన రెండు విమానాలను తాత్కాలికంగా నిషేధించింది. పలువురు ప్రయాణికులు కరోనా బారిన పడటంతో… అక్టోబర్ 30 వరకు ఎయిర్ ఇండియా మరియు విస్టారా విమానాలను నిషేధించింది. కరోనా రోగులను పదే పదే తీసుకొస్తున్న ఎయిర్ ఇండియాకు గతంలో కూడా షాక్ ఇచ్చింది.
హాంకాంగ్ ప్రభుత్వం ఎయిర్ ఇండియా విమానాలను నిషేధించడం ఇది మూడోసారి. సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 3 వరకు మరియు ఆగస్టు 18 నుండి ఆగస్టు 31 వరకు రెండు సార్లు నిషేధించింది. స్థానిక అధికారులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, హాంకాంగ్‌లో వచ్చే ప్రయాణికులందరూ ప్రయాణానికి 72 గంటలలోపు చేసిన పరీక్షలో కరోనా నెగటివ్ గా రావాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం వారిని విమాన ప్రయాణానికి అనుమతించరు.