జూన్ 15 న తూర్పు లడఖ్‌లో గాల్వన్ వ్యాలీలో ఘర్షణల తరువాత భారతదేశం మరియు చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇందులో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) కు కూడా భారీ నష్టం జరిగింది. 1975 తరువాత చైనా సరిహద్దుల్లో భారత్ కు జరిగిన అతి పెద్ద సైనిక నష్టం.
ఈ ఘటన కారణంగానే రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో భారీగా దూరం పెరిగిందని, రాజకీయ పరిస్థితులు కూడా ఈ ఘటన తర్వాత రెండు దేశాల్లో మారిపోయాయి అని కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ ప్రకటన చేసారు. దౌత్య మరియు సైనిక స్థాయిలో అనేక రౌండ్ల చర్చలు జరిగినా సరే సాధారణ పరిస్థితి సరిహద్దుల్లో రాలేదు అనే చెప్పాలి. అందుకే సైనికులను వెనక్కు పిలవలేము అని ఆయన స్పష్టం చేసారు.