డ్రైవింగ్‌ లైసెన్స్‌ అక్కర్లేని ఎలక్ట్రిక్‌ బైక్‌!

-

ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే ఎలక్ట్రిక్‌ బైక్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ అవసరం లేదు. దీనికి 2 ఏళ్ల వారెంటీ కూడా ఉంది. పైగా దీని మైలేజీ 100 కీమీ. దీన్ని చిన్నాపెద్దా అన్న తేడా లేకుండా ఏ వయసు వారైనా నడపవచ్చు. ఇప్పుడు ఆ బైక్‌ కథా కహానీ ఏంటో మనం తెలుసుకుందాం. వంశీ అనే ఆయన అమెరికాలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ చేశాడు. అతను చేసిన కృషి ఫలితమే ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌. అతను ఏదో చేయాలనే ఆలోచనే ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌ను మనందరికీ పరిచయం చేసింది. ఈ బైక్‌ పేరు ATUM  1.0 ఆయన మూడేళ్ల కష్టపడి ఈ బైక్‌ను తయారు చేశాడు. దీనికి అతని స్నేహితులు కూడా సాయం చేశారు. దీని బరువు ఓవర్‌ ఆల్‌గా వచ్చేసి 35 కేజీలు. ఇది గంటకు 25 కీమీ స్పీడ్‌తో వెళ్తుంది. 48 ఓల్ట్, 250 వాట్స్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ ప్యాక్‌ ఉంది. 4 గంటల పాటు ఛార్జ్‌ చేస్తే.. 100 కీమీ వరకు ప్రయాణించవచ్చు.

ఈ బైక్‌కి 2 ఏళ్ల వారంటీ ఉంది. ప్రస్తుతం ఈ వాహనానికి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుందని వంశీ అంటున్నాడు. ఇప్పటివరకూ వివిధ రాష్ట్రాల నుంచి 300 బుకింగ్స్‌ వచ్చాయన్నారు. ఈ కంపెనీ బైక్‌ తయారీ కేంద్రం తెలంగాణలో ఉంది. ప్రతి రోజూ 250– 300 బైకులు తయారుచేయగలరు. కస్టమర్ల డిమాండ్‌ను బట్టి భారీస్థాయిలో ఉత్పత్తి యూనిట్‌ రెడీ చేశారు. ప్రస్తుతం ఈ బైక్‌ ధర రూ.50,000 ఉంది. కావాలనుకునేవారు ఆటోమొబైల్స్‌ ఆన్స్లైన్‌ పోర్టల్‌ జ్టి్టhttps://atumobileద్వారా బుక్‌ చేసుకోవచ్చు.

మీకూ ఈ ఆటం 1.0ని అడ్వాన్స్గా బైక్‌ బుక్‌ చేసుకోవాలంటే… ముందుగా రూ.3,000 కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ బైక్‌ని రివోల్డ్‌ ఇంటెల్‌ కార్ప్‌ అనే స్టార్టప్‌ కంపెనీ లాంచ్‌ చేసింది. ఈ వాహనానికి జియో–ఫెన్సింగ్, రిమోట్‌ డయాగ్నోస్టిక్స్, క్లౌడ్‌ సర్వీసెస్, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ అన్నీ ఉన్నాయి. ఇందులో 4ఎ సిమ్‌ కార్డ్‌ కూడా ఉంది. వెహికిల్‌ పెర్ఫార్మెన్స్, హెల్త్‌ గురించి తెలుసుకోవడానికి కంపెనీ వైబ్‌ సైట్‌ నుంచి మొబైల్‌ యాప్‌ డౌన్స్లోడ్‌ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version