కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో… కాలిపోతున్న అడవి జంతువుని దుస్తులు విప్పి రక్షించిన మహిళ…!

-

ఆస్ట్రేలియా కాలిపోతున్న అడవి.. గత కొన్ని నెలలుగా విస్తరిస్తున్న మంటలు అక్కడి జనజీవనాన్ని నానా ఇబ్బందులు పెడుతున్నాయి. క్రమంగా దేశం మొత్తం మంటలు వ్యాపించడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. సిడ్నీలో చెలరేగిన మంటలు… విక్టోరియా, టాస్మానియా రాష్ట్రాలకు కూడా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మంటలు న్యూ సౌత్ వేల్స్ (ఎన్ఎస్డబ్ల్యు) మరియు క్వీన్స్లాండ్లలో – 500 కి పైగా ఇళ్లను ధ్వంసం చేశాయి. దక్షిణ ఆస్ట్రేలియా (ఎస్‌ఐ) లో మంటలు బుధవారం తీవ్ర రూపం దాల్చాయని అధికారులు పేర్కొన్నారు.

ఉన్నటుండి మంటలు చెలరేగడంతో ప్రజలు భయపడిపోతున్నారు. వేడి గాలుల తీవ్రత కూడా క్రమంగా పెరగడంతో దేశం విడిచి పారిపోతున్నారు ప్రజలు. కొత్త మంటల ప్రమాదాన్ని తగ్గించడానికి అధికారులు సుమారు 10,000 గృహాలు మరియు వ్యాపారాలకు విద్యుత్తును ఆపివేశారు. విద్యుత్తు లైన్లను పడగొట్టే గాలులు వీస్తున్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 సి (113 ఎఫ్) కి చేరుకున్నాయి, ఇది 90 కిలోమీటర్ల / గం (55 పిఎమ్‌పి) వేగంతో గాలులు వీస్తున్నాయి.

దీనికి సంబంధించి అంతర్జాతీయ వార్తా సంస్థ… బీబీసి ఒక వీడియో ని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో అడవుల్లో మంటలు వస్తుండగా… ఆ మంటల బారి నుంచి తప్పించుకోవడానికి చిన్న చిన్న అడవి జంతువులు పారిపోతూ ఉంటాయి. కొన్ని జంతువులకు మంటలు అంటుకుని పైన చర్మం మొత్తం కాలిపోతుంది. అటుగా వెళ్తున్న ఒక మహిళ మంటల్లో కాలిపోతున్న జంతువుని తన వంటి మీద ఉన్న దుస్తులు విప్పి మంటల నుంచి రక్షిస్తుంది. వెంటనే తన కారులో ఆ జంతువుని తీసుకువెళ్లడం వీడియోలో ఉంటుంది. అలాగే ఆ జంతువుకి అంటుకున్న మంటలు ఆర్పడానికి గాను తన వద్ద ఉన్న మంచి నీళ్ల బాటిల్ తో దానిని తడపడం కన్నీళ్లు పెట్టిస్తుంది. మంటల వేడి తట్టుకోలేక ఒక జంతువు ఏడుస్తూ ఉంటుంది. ఈ వీడియో ఆసాంతం హృదయ విదారకంగా మారింది. అటు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఆస్ట్రేలియా త్వరగా కోలుకోవాలని పలువురు ప్రార్థిస్తున్నారు. ఇక మంటల దెబ్బకు ప్రజలకు ఊపిరి ఆడటం లేదు.

(బీబీసీ సౌజన్యంతో) వీడియో లింక్ కింద ఇవ్వడం జరిగింది…

https://www.bbc.com/news/world-australia-50483410

Read more RELATED
Recommended to you

Exit mobile version