‘మీ భర్తను ఎలా హత్య చేయాలి’ అనే పుస్తకం రాసి.. భర్తనే కాల్చి చంపిన రచయిత్రి..!!

-

అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ‘మీ భర్తను ఎలా చంపాలి’ అనే నవల రాసిన ఓ ప్రముఖ రచయిత్రి.. తన భర్తను దారుణంగా కాల్చి చంపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఆమెకు జీవిత ఖైదు వేసింది.

రచయిత్రి నాన్సీ

నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ (71) అమెరికాలో రచయిత్రిగా కొనసాగుతున్నారు. మీ భర్తను ఎలా చంపాలి అనే పుస్తకాన్ని రాశారు. అయితే ఈ పుస్తకం చాలా ఫేమస్ అయింది. అయితే నిజంగానే ఆమె తన భర్తను తుపాకీతో కాల్చి చంపింది. దీంతో ఆమెకు కోర్టు జీవిత ఖైదు విధించింది. 25 ఏళ్ల తర్వాత పెరోల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాన్సీ భర్త డేనియల్ బ్రోఫీ 2018లో అతడు పని చేసే ఇనిస్టిట్యూట్‌లో చనిపోయి కనిపించాడు. అతడి ఒంటిపై రెండు చోట్ల గన్‌తో షూట్ చేసినట్లు గుర్తించారు. అదే సమయంలో నాన్సీ అదే ప్రాంతంలో డ్రైవింగ్ చేస్తున్నట్లు సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. ఈ మేరకు నాన్సీని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version